జార్ఖండ్ తన రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 3, 2022న ప్రకటించింది. విద్యా రంగానికి మొత్తం బడ్జెట్‌లో 13.54% మొత్తం ఖర్చు చేయబడింది. సమాజంలోని అణగారిన వర్గాలకు లబ్ధి చేకూర్చేలా పలు పథకాలను ప్రకటించారు. నామమాత్రపు వడ్డీతో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు విద్యా రుణాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్న 'గురూజీ క్రెడిట్ కార్డ్' పథకం తీసుకుని వచ్చారు. "విద్యా రుణం కోసం, బ్యాంకులు కొలేటరల్ సెక్యూరిటీని అడుగుతాయి కానీ, పేద విద్యార్థులు సాధారణంగా దానిని అందించలేరు. అటువంటి సందర్భాలలో, వారు ఉన్నత విద్య అవకాశాన్ని కోల్పోతారు. గురూజీ క్రెడిట్ కార్డ్ కింద, అటువంటి రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటర్‌గా ఉంటుంది." అని బడ్జెట్ అనంతర సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజోయ్ కుమార్ సింగ్ అన్నారు.
10 లక్షల వరకు రుణం 4% సాధారణ వడ్డీ రేటుతో అందించబడుతుందని తెలిపారు. విశ్వవిద్యాలయం, కళాశాలలు మొదలైన వాటిలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఈ పథకం ప్రత్యేకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాథమిక విద్యకు 11 వేల కోట్లు, ఉన్నత, సాంకేతిక విద్యకు 2 వేల కోట్లు రూపాయలు కేటాయించింది.
రామ్‌గఢ్ జిల్లాలోని గోలాలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. విశ్వవిద్యాలయాలకు ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం జార్ఖండ్ రాంచీ పాఠశాలల్లో రీడింగ్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేయనుంది. గణితం, సైన్స్ ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని విద్యార్థులకు ఇప్పుడు యూనిఫారాలు అందజేస్తామని, ఈ పథకం ద్వారా 15 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గురూజీ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌తో పాటు, డిగ్రీ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ముఖ్యమంత్రి సారథి పథకం కూడా ప్రతిపాదించబడింది.