ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Jharkhand Murder Case. జార్ఖండ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్య

By Medi Samrat  Published on  24 Feb 2021 11:10 AM GMT
Jharkhand Murder Case

జార్ఖండ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. గుమ్లా జిల్లాలోని కామ్‌దరా పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి, తల్లి, కుమారుడు, కోడలు, ఓ చిన్నారిని పదునైన ఆయుధంతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం వెలుగు చూసింది. స్థానికులు బుధవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.


పహర్తోలి గ్రామానికి చెందిన నికుదీన్‌ తోప్పో (60) కుటుంబం నివాసం ఉంటోంది. బుధవారం ఉదయం నికుదీన్‌ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి వారింట్లోకి వెళ్లి చూడగా, ఐదుగురు రక్తపు మడుగులో విగతజీవులై పడి ఉన్నారు. దీంతో స్థానికులు పోలీసులకు ఇవ్వడంతో వారు వచ్చి విచారణ చేపట్టారు. మృతులు నికుదీన్ తోప్నో (60), భార్య జోస్పినా (55), వారి కుమారుడు విన్సెంట్ (35), కోడలు సైల్వంతీ (30), వీరి ఐదేళ్ల కుమారుడు అశ్విన్‌గా పోలీసులు గుర్తించారు. వీరి హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మరో వైపు కుటుంబ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, గత కొంతకాలంగా నికుదీన్ కుటుంబం ఆర్ధికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు స్థానికులు పోలీసులు వివరించారు.

ఘటన స్థలానికి డాగ్ స్వ్యాడ్‌ను రప్పించి పరిశీలించారు. అయితే ఇంట్లో మృతదేహాలు ఒక్కో చోట పడి ఉండటంతో హత్యగానే భావిస్తున్నారు పోలీసులు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి శరీరాలపై ఉన్న గాయాలను బట్టి గొడ్డలితో దాడిచేసిన చంపిపట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.
Next Story
Share it