ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్‌ మృతి, మరో ఇద్దరికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) పేలుడులో ఛత్తీస్‌గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) జవాన్ మృతి చెందాడు.

By అంజి
Published on : 18 Aug 2025 9:29 AM IST

Jawan killed, 2 injured, IED, Maoists, Chhattisgarh, Bijapur

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్‌ మృతి, మరో ఇద్దరికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) పేలుడులో ఛత్తీస్‌గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) జవాన్ మృతి చెందాడు. మరో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో సోమవారం ఉదయం రాష్ట్ర పోలీసు విభాగం అయిన డిఆర్‌జి బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు పేలుడు సంభవించిందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ఈ పేలుడులో డీఆర్‌జీ జవాన్ దినేష్ నాగ్ మరణించారని అధికారి తెలిపారు. గాయపడిన సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించబడింది. ప్రస్తుతం అడవి నుండి సిబ్బందిని ఖాళీ చేయిస్తున్నట్లు అధికారి తెలిపారు.

Next Story