జనవరి 1న బళ్లారిలో బ్యానర్ సంబంధిత ఘర్షణ ఇంకా తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు బళ్లారి-బెళగల్లు రోడ్డులోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. ఒక ప్రైవేట్ లేఅవుట్‌లో ఉన్న మోడల్ ఇంటికి నిప్పంటించారు. ఇది నగరంలో కొత్త ఉద్రిక్తతకు దారితీసింది.
కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. రూ.3 కోట్ల విలువైన ఇంటి, కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ కాలిపోయింది. ఈ ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారని గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఇంటి కినిప్పు పెట్టిన సమయంలో జనార్థన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్థన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు.