రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ

జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించింది.

By Medi Samrat  Published on  16 Aug 2024 4:20 PM IST
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ

జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో.. హర్యానాలో సింగిల్‌ ఫేజ్‌లో ఓటింగ్‌ జరుగుతుందని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇది రెండో దశ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. లోక్ సభ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని.. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నో రికార్డులు సృష్టించామని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు.

హర్యానా ఎన్నికలకు సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్‌కు చివరి తేదీ సెప్టెంబర్ 12. అక్టోబర్ 1న ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లో మొదటి దశకు నోటిఫికేషన్ ఆగస్టు 20న విడుదల కానుంది, నామినేషన్‌కు చివరి తేదీ ఆగస్టు 27. అభ్యర్థిత్వ ఉపసంహరణకు ఆగస్టు 30 చివరి తేదీ. సెప్టెంబర్ 18న ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు 29న విడుదల కానుండగా.. నామినేషన్‌కు చివరి తేదీ సెప్టెంబర్ 5. అభ్యర్థిత్వ ఉపసంహరణకు చివరి తేదీ సెప్టెంబర్ 9. సెప్టెంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 5న విడుదల కానుండగా.. నామినేషన్‌కు చివరి తేదీ సెప్టెంబర్ 12. అభ్యర్థిత్వ ఉపసంహరణకు చివరి తేదీ సెప్టెంబర్ 17.. అక్టోబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Next Story