హిట్ అండ్ రన్ కేసు.. నిందితుడిని పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్
రాజస్థాన్‌లోని జైపూర్‌లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat
రాజస్థాన్‌లోని జైపూర్‌లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత రాత్రి నహర్‌ఘర్ ప్రాంతంలో ఒక SUV కారు పాదచారులను ఢీకొట్టింది.. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.. ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన ఉస్మాన్ అనే నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా పలువురు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
నిందితుడు ఉస్మాన్‌ను అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ బజరంగ్ సింగ్ షెకావత్ వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు. అతడు త్రాగి ఉన్నాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. అయితే.. డ్రైవర్ ఉస్మాన్ ఖాన్‌కు కాంగ్రెస్‌తో సంబంధం వుంది. ఆయన జిల్లా కార్యవర్గ సభ్యుడు. ఈ ఘటనపై జైపూర్‌లో నిరసనలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
మరోవైపు నిందితుడి కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది. నిందితుడు వైద్య పరికరాల వ్యాపారం చేస్తుంటాడు. కారు అతని కంపెనీకి చెందినది.
కాగా, నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశాడని బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్య ఆరోపించారు. నిందితుడు ఉస్మాన్ హసన్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశాడని ఆచార్య ఏఎన్‌ఐకి తెలిపారు. ఆయన కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందుతుందని, ఈ ప్రమాదానికి కారణమైన వారిపై బుల్‌డోజర్‌ను ప్రయోగిస్తామని నా ప్రభుత్వంపై, సీఎం భజన్‌లాల్ శర్మపై నాకు పూర్తి విశ్వాసం ఉందని బీజేపీ నేత అన్నారు. నిందితుడు అమీన్ కాగ్జీ (కాంగ్రెస్ ఎమ్మెల్యే) కార్యకర్త.. అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
ఈ ఘటనతో నహర్‌ఘర్‌లో భయానక వాతావరణం నెలకొంది. గాయపడిన వారికి సహాయం చేయడానికి చుట్టుపక్కల ఉన్నవారు, అత్యవసర సేవలను పిలిచారు. ఈ ఘటన అనంతరం ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఆ గుంపు రోడ్డుపై బైఠాయించి టైర్లకు నిప్పంటించారు.
గత రాత్రి నహర్‌ఘర్‌లో వాహనం MI రోడ్ నుండి ఇరుకైన సందులకు చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ దారిలో వెళ్తున్న కొంత మందిని, ఆగి ఉన్న వాహనాలను ఢీ కొడుతూ వెళ్లడంతో ప్రమాదం జరిగింది.