మద్యం పాలసీ కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు కోర్టు నుంచి ఊరట లభించింది. భార్యను కలిసేందుకు కోర్టు పెరోల్ ఇచ్చింది. వారానికి ఒకసారి అనారోగ్యంతో ఉన్న అతని భార్య, వైద్యులను కలవడానికి కోర్టు అనుమతించింది. మనీష్ భార్య అనారోగ్యంతో ఉంది. దీంతో తన భార్యను కలిసేందుకు అనుమతించాలని కోర్టును ఆశ్రయించారు మనీష్. కోర్టు సోమవారం ఆయనకు రిలీఫ్ ఇచ్చింది.
మరోవైపు, మద్యం పాలసీ కుంభకోణంలో ఈడీ ఐదుసార్లు సమన్లు పంపినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. కోర్టు అడిగితే కచ్చితంగా సమాధానం చెబుతామని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో ఫిబ్రవరి 7న విచారణ జరగనుంది.