నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-51
ISRO's PSLV C51 Mission lifts off Amazonia 1 satellite from Sriharikota.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరోసారి పీఎస్‌ఎల్వీ సీ-51
By తోట వంశీ కుమార్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరోసారి సత్తా చాటింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సి-51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్త్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. ఇది ఈ ఏడాది ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం కాగా.. మొదటి ప్రయోగ వేదిక నుంచి 39వ ప్రయోగం. పీఎస్ఎల్‌వీ-డీఎల్ వర్షన్‌లో మూడోది. ప్రయోగం నేపథ్యంలో షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
#WATCH ISRO's PSLV-C51 carrying Amazonia-1 and 18 other satellites lifts off from Satish Dhawan Space Centre, Sriharikota pic.twitter.com/jtyQUYi1O0
— ANI (@ANI) February 28, 2021
పీఎస్‌ఎల్‌వీ సీ 51 ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన అమెజానియా–1 ఉపగ్రహం(637 కిలోల బరువు), అమెరికాకు చెందిన స్పేస్ బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయ్–1 నానో కాంటాక్ట్–2 ఉపగ్రహాలు, న్యూ స్పేస్ ఇండియా పేరుతో భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన సతీష్ ధవన్ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్ శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌లను అంతరిక్షంలోకి పంపారు. వీటిలోని ఒక శాటిలైట్‌లో తొలిసారిగా మోదీ ఫొటో, భగవద్గీత అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. బ్రెజిల్ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటస్ షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూశౄరు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.