మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన‌ ఇస్రో

ISRO to Launch LVM3 Rocket Carrying 36 OneWeb Satellites on Sunday. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎన్నో సంచలనాలకు కేరాఫ్ గా మారింది.

By M.S.R
Published on : 25 March 2023 4:07 PM IST

మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన‌ ఇస్రో

ISRO to Launch LVM3 Rocket Carrying 36 OneWeb Satellites on Sunday


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎన్నో సంచలనాలకు కేరాఫ్ గా మారింది. వరుస ప్రయోగాలతో.. భారీ సక్సెస్ రేట్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు మరో భారీ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. మార్చి 26న షార్ నుండి ఎల్వీఎం–3 రాకెట్ ను శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం నిర్వహించిన రిహార్సల్స్‌ విజయవంతం కావడంతో.. మార్చి 26వ తేదీన ఆదివారం రాత్రి ఉదయం గంటలకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. మొదటి విడతలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా 36 ఉపగ్రహాలను నింగి లోకి పంపనున్నారు. ఎల్‌వీఎం-3 రాకెట్‌ ద్వారా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. 5,805 కేజీలు బరువు కలిగి ఉన్న 36 ఉపగ్రహాలను 450 కి.మీ. ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు. 36 వన్​వెబ్​ ఉపగ్రహాలతో కూడిన మొదటి బ్యాచ్‌ను గత ఏడాది అక్టోబర్ 23న శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఇది కూడా సక్సెస్ అవుతుందని శాస్త్రవేత్తలు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.


Next Story