చరిత్ర సృష్టించిన భారత్..బ్లూ బర్డ్ శాటిలైట్ సక్సెస్

అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ISRO సరికొత్త చరిత్ర సృష్టించింది.

By -  Knakam Karthik
Published on : 24 Dec 2025 9:42 AM IST

National News, Isro, Bluebird Block-2 communication satellite

చరిత్ర సృష్టించిన భారత్..బ్లూ బర్డ్ శాటిలైట్ సక్సెస్

అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ISRO సరికొత్త చరిత్ర సృష్టించింది. 6,100KGల బరువైన బ్లూబర్డ్ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 24 గంటల కౌంట్‌డౌన్ అనంతరం 8.54AMకు LVM3-M6 రాకెట్ దూసుకెళ్లింది. 15.7 ని.ల్లో రాకెట్ 3 దశలను కంప్లీట్ చేసుకుని లో ఎర్త్ ఆర్బిట్‌లో ఉప్రగహాన్ని ప్రవేశపెట్టింది. ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత బరువైనది ఇదే. గతంలో 4,400KGల శాటిలైట్‌ను ISRO నింగిలోకి పంపింది.

ఈ వాణిజ్య ప్రయోగంతో ఇస్రో తన బాహుబలి రాకెట్ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. రాకెట్ మొత్తం మూడు దశలను సుమారు 15.07 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేసి, ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్‌ (లియో)లోకి ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఈ ప్రయోగాన్ని ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నిర్వహించింది.

Next Story