బెంగాల్ స్టార్స్ కు భారతీయ జనతా పార్టీ గాలం

Is Bengali actor Yash Dasgupta joining BJP. పశ్చిమ బెంగాల్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో భారతీయ జనతా పార్టీ ఉంది.

By Medi Samrat
Published on : 17 Feb 2021 10:37 AM

Is Bengali actor Yash Dasgupta joining BJP

పశ్చిమ బెంగాల్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులను, తృణమూల్ కాంగ్రెస్ నేతలను బీజేపీ తమవైపు తిప్పుకుంది. ఇక బెంగాల్ లో ప్రముఖులను కూడా తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది పశ్చిమ బెంగాల్ బీజేపీ విభాగం..!

బెంగాల్‌ చిత్రపరిశ్రమ యంగ్‌ హీరో యాష్‌ దాస్‌గుప్తాను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీజేపీ పిలుపుమేరకు గురు, శుక్రవారాలలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ఆయన సమీప వ్యక్తుల ద్వారా తెలుస్తోంది. 2016లో విడుదలైన గ్యాంగ్‌స్టర్‌ చిత్రంతో యాష్‌ దాస్‌గుప్తా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తరువాత పలు హిట్‌ చిత్రాల్లో నటింటి ఆయనకంటూ చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి, దాస్‌గుప్తా మధ్య ప్రేమాయణం నడిచినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్లు వినిపించాయి. ఇక బీజేపీలో చేరికపై దాస్‌గుప్తా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు..!

వరుస రెండు ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తిరుగులేని శక్తిగా నిలిచారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తృణమూల్ కాంగ్రెస్ ను మట్టికరిపించాలని భావిస్తోంది.


Next Story