ఇండిగో బుకింగ్ సిస్టమ్ విఫలం.. విమాన సేవ‌ల‌కు అంత‌రాయం

ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్ విధానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది

By Medi Samrat  Published on  5 Oct 2024 3:44 PM IST
ఇండిగో బుకింగ్ సిస్టమ్ విఫలం.. విమాన సేవ‌ల‌కు అంత‌రాయం

ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్ విధానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కంపెనీ బుకింగ్ సిస్టమ్‌లో లోపం కారణంగా విమాన కార్య‌క‌లాపాలు ప్రభావితమయ్యాయి. నివేదిక ప్రకారం.. ఎయిర్‌లైన్ బుకింగ్ సిస్టమ్ సాంకేతిక లోపం కారణంగా మధ్యాహ్నం 12 గంటలకు పనిచేయడం మంద‌గించింది. ఆపై ఒక గంట తర్వాత పనిచేయడం ప్రారంభించింది.

సాంకేతిక లోపం కారణంగా ఇండిగో విమాన కార్యకలాపాలు మొత్తం దెబ్బతిన్నాయి. దేశంలోని విమానాశ్రయాల్లో సర్వీసులు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా చాలా మంది ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోయారు. దీంతో పాటు విమానాశ్రయాల వద్ద ప్రయాణికుల పెద్ద క్యూలు కనిపించాయి. ఇబ్బంది పడిన ప్రయాణికులు తమ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయంలో DGCA జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఇండిగో.. మా నెట్‌వర్క్‌లో తాత్కాలిక మందగమనం గమనించబడుతోందని పేర్కొంది. దీంతో వెబ్‌సైట్, బుకింగ్ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. దీంతో ప్రయాణికులు ఎక్కువ స‌మ‌యం వేచి ఉండాల్సి ప‌రిస్థితి నెల‌కొంది. విమానాశ్రయంలో చెక్‌ఇన్ నెమ్మ‌దిగా అవుతున్న కార‌ణంగా పొడవైన లైన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.

Next Story