ఇండిగో విమానంలో మంట‌లు.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

IndiGo plane bound to Bengaluru catches fire before take-off in Delhi.ఇండిగో విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 29 Oct 2022 9:14 AM IST

ఇండిగో విమానంలో మంట‌లు.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

ఇండిగో విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. టేకాఫ్‌కు ముందు విమాన ఇంజిన్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన ఫైల‌ట్లు వెంట‌నే విమానాన్ని అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో చోటు చేసుకుంది.

ఇండిగోకు చెందిన 6ఈ-2131 విమానం ఢిల్లీ నుంచి బెంగ‌ళూరుకు 177 మంది ప్ర‌యాణీకుల‌తో ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి బ‌య‌లుదేరింది. ర‌న్‌వేపై టేకాఫ్ అవుతుండ‌గా విమానంలోని ఇంజిన్‌లో మంట‌లు రావ‌డాన్ని ఫైల‌ట్లు గుర్తించారు. వెంట‌నే విమానాశ్ర‌య అధికారులకుస‌మాచారం అందించి అత్య‌వ‌స‌రంగా నిలిపివేశారు. ప్ర‌యాణీకులంద‌రిని కింద‌కు దింపేశారు. ప్ర‌యాణీకులు అంద‌రూ క్షేమంగా ఉన్న‌ట్లు విమానాశ్ర‌య అధికారులు తెలిపారు.

వారందరిని ప్రత్యామ్నాయ విమానంలో గమ్యస్థానికి తరలించారు. ఆ స‌మ‌యంలో విమానంలో 177 మంది ప్ర‌యాణీకుల‌తో పాటు సిబ్బంది క‌లిపి 184 మంది ఉన్నారు. ఈ ఘటనపై డీజీసీఏ స్పందించింది. సమగ్ర విచారణ జరపాలని అధికారులను, వీలైనంత తొందరగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.


Next Story