పార్లమెంటులో ఇండిగో సంక్షోభంపై మాట్లాడిన మంత్రి
గత వారం రోజులుగా ఇండిగో సంక్షోభం యావత్ దేశాన్ని కుదిపేసింది
By - Medi Samrat |
గత వారం రోజులుగా ఇండిగో సంక్షోభం యావత్ దేశాన్ని కుదిపేసింది. వేల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో ప్రజలు విమానాశ్రయంలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. అయితే ఈ మొత్తం ఘటనపై ప్రభుత్వం గట్టి నిఘా పెట్టింది. ఇప్పుడు దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి పార్లమెంటులో ప్రకటన ఇచ్చారు.
గడిచిన రోజుల్లో ఏం జరిగినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సూటిగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని విమానయాన సంస్థలకు ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుంది.
పార్లమెంటులో ఇండిగో సంక్షోభంపై కేంద్ర మంత్రి నాయుడు మాట్లాడుతూ.. “విమానాల ఆలస్యం లేదా రద్దు కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యాన్ని పరిష్కరించడానికి కఠినమైన పౌర విమానయాన నిబంధనలు రూపొందించబడ్డాయి. అన్ని విమానయాన సంస్థలు వాటిని అనుసరించాలి. సాఫ్ట్‌వేర్ లోపంపై దర్యాప్తు ప్రారంభమైందన్నారు.
ఎఫ్‌డిటిఎల్ నిబంధనల అమలుకు ముందు డిసెంబర్ 1వ తేదీన మేము ఇండిగోతో సమావేశమయ్యాము. మేము నిబంధనల మార్పు గురించి వారికి తెలియజేసాము. అప్పుడు వారు దీనిపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. డిసెంబర్ 3న హఠాత్తుగా విమానాల రద్దు ప్రక్రియ మొదలైంది. మేము వెంటనే ఈ విషయాన్ని గుర్తించాము. ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత.. గత 2 రోజులుగా పరిస్థితులు మెరుగుపడటం మీరే చూశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మేము దీనిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో అన్ని విమానయాన సంస్థలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు.
రామ్ మోహన్ నాయుడు పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. “మేము పైలట్లు, సిబ్బంది, ప్రయాణీకులను జాగ్రత్తగా చూసుకుంటాము. మేము అన్ని విమానయాన సంస్థలను క్లియర్ చేప్పాము. మేము విచారణ ప్రారంభించాము.. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.