దేశంలో తొలి ఫుడ్ మ్యూజియం ప్రారంభం.. ఎక్కడంటే.!

Indias first food museum inaugurated in thanjavur. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి ఫుడ్ మ్యూజియాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి

By అంజి
Published on : 16 Nov 2021 4:16 PM IST

దేశంలో తొలి ఫుడ్ మ్యూజియం ప్రారంభం.. ఎక్కడంటే.!

తమిళనాడులోని తంజావూరు జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి ఫుడ్ మ్యూజియాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రారంభించారు. ఈ మ్యూజియాన్ని 1860 అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. భారత ఆహార సంస్థ, విశ్వేశరయ్య ఇండస్ట్రియల్‌ అండ్‌ టెక్నాలజీలు సంయుక్తంగా రూ.1.10 కోట్ల వ్యయంతో మ్యూజియాన్ని నిర్మించాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి, ధాన్యాల సేకరణ విధానం, సవాళ్లు వంటి వాటిని వివరించేలా కొత్త టెక్నాలజీతో మ్యూజియాన్ని రూపొందించారు.

పంట పొలాలు, పల్లెలకు సంబంధించి అంశాలను డిజటల రూపంలో ప్రదర్శించారు. గ్లోబల్, దేశీయమైన వివిధ పురాతన ధాన్యం నిల్వ పద్ధతుల నమూనాలు మ్యూజియంలో ప్రదర్శించబడతాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మ్యూజియాన్ని ప్రారంభించిన మంత్రి పీయుష్‌ గోయల్‌ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ ఎగుమతిదారుల జాబితాలో భారతదేశాన్ని అగ్రస్థానంలో ఉంచుతున్నాయని పేర్కొన్నారు. తంజావూరులోని నిర్మలా నగర్‌లోని ఎఫ్‌సిఐ డివిజనల్ కార్యాలయంలోని మ్యూజియం ఏర్పాటు చేశారు.

మ్యూజియం అన్ని పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. 56 సంవత్సరాల క్రితం జనవరి 14, 1965న తంజావూర్‌ పట్టణంలో ఎఫ్‌సిఐ మొదటి కార్యాలయం ప్రారంభించబడినందున.. మళ్లీ ఇక్కడే ఆహార మ్యూజియాన్ని స్థాపించారు. మ్యూజియం ప్రారంభం కార్యక్రమంలో దల్జీత్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సౌత్), సంజీవ్ కుమార్ గౌతమ్, చీఫ్ జనరల్ మేనేజర్, PNS సింగ్, జనరల్ మేనేజర్ (TN), మరియు KASadhana, VITM డైరెక్టర్, దేవేంద్ర సింగ్ మార్టోలియా, FCI డివిజనల్ మేనేజర్, మ్యూజియంలో ఉన్నారు.


Next Story