లవ్‌ మ్యారేజ్‌ చేసుకోవడానికి పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయుడు

ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ ఓ భారతీయుడు పాకిస్థాన్‌కు వెళ్లి సుక్కూర్‌లో ఓ మహిళను వివాహం చేసుకున్నట్లు

By అంజి  Published on  2 May 2023 6:45 PM IST
Indian,  Pakistan, Love marriage, Viral news

లవ్‌ మ్యారేజ్‌ చేసుకోవడానికి పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయుడు

ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ ఓ భారతీయుడు పాకిస్థాన్‌కు వెళ్లి సుక్కూర్‌లో ఓ మహిళను వివాహం చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబైకి చెందిన మహేందర్ కుమార్, సంజుగత కుమారిని వివాహం చేసుకోవడానికి తన కుటుంబంతో సహా సుక్కూర్‌కు వచ్చినట్లు జియో న్యూస్ తెలిపింది. సుక్కూర్‌లోని స్థానిక హాలులో వివాహం జరిగింది, దీనికి జంట బంధువులు, హిందూ సమాజానికి చెందిన వ్యక్తులు హాజరయ్యారు.

లీగల్ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత కుమారి తన భర్తతో కలిసి మరికొద్ది రోజుల్లో భారతదేశానికి బయలుదేరుతుంది. సోషల్ మీడియాలో స్నేహంగా మారిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వధువు తల్లిదండ్రులు తెలిపారు. తరువాత కుటుంబాలు వాట్సాప్ ద్వారా ఒకరినొకరు సంప్రదించి వివాహ వేడుకను ఖరారు చేసినట్లు జియో న్యూస్ నివేదించింది. వివాహ కార్యక్రమానికి హాజరైన ముఖి హిందూ పంజాత్ సుక్కుర్‌కు చెందిన ఐశ్వర్ లాల్ మకేజా మాట్లాడుతూ.. ప్రేమకు సరిహద్దులు లేవని, ఈ జంట సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

Next Story