దుబాయ్‌లో నివసిస్తున్న 49 ఏళ్ల భారతీయ ప్రవాసుడికి జాక్ పాట్ తగిలింది. తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ (DDF) మిలీనియం మిలియనీర్ డ్రాలో ఒక మిలియన్ US డాలర్లు గెలుచుకున్నాడు. అంటే భారత కరెన్సీలో దాదాపు 8 కోట్ల రూపాయలు. కేరళకు చెందిన బిజు థెరూల్, డ్రాలోని సిరీస్ 499లో టికెట్ నంబర్ 0437తో బహుమతిని పొందాడు. ఏప్రిల్ 19న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2 డిపార్చర్‌లో సెలవుల కోసం కేరళకు విమానం ఎక్కే ముందు అతను ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు చేశాడు.
రిటైల్ చైన్‌లో పనిచేస్తున్న థెరూల్ గత 20 సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా DDF ప్రమోషన్లలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. ప్రత్యేక డ్రాలో, UAEలో నివసిస్తున్న భారతీయ పౌరురాలు సోమ నాగరాజ్, ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ సిరీస్ 621లో ఇండియన్ 101 స్కౌట్ మోటార్‌బైక్‌ను గెలుచుకున్నారు.