శ‌త్రుమూక‌ల‌పై విరుచుకుప‌డేందుకు స‌రికొత్త వ్యూహంతో సిద్ధ‌మ‌వుతున్న భారత సైన్యం

తీవ్రవాదులకు చెక్ పెట్టడానికి భారత సైన్యం సరికొత్త వ్యూహాలను రచిస్తూ ఉంది. ఇకపై మనుషులను కాకుండా డ్రోన్ ల ద్వారా శత్రువులకు చెక్ పెట్టాలని భావిస్తూ ఉంది

By Medi Samrat  Published on  28 Sep 2024 3:21 AM GMT
శ‌త్రుమూక‌ల‌పై విరుచుకుప‌డేందుకు స‌రికొత్త వ్యూహంతో సిద్ధ‌మ‌వుతున్న భారత సైన్యం

తీవ్రవాదులకు చెక్ పెట్టడానికి భారత సైన్యం సరికొత్త వ్యూహాలను రచిస్తూ ఉంది. ఇకపై మనుషులను కాకుండా డ్రోన్ ల ద్వారా శత్రువులకు చెక్ పెట్టాలని భావిస్తూ ఉంది. అందుకు తగ్గ ప్లాన్ ను భారత సైన్యం రచించేసింది. భారత సైన్యం తన శక్తిని తీవ్రవాదులకు చాటి చెప్పడానికి , సుదూర సూసైడ్ డ్రోన్‌లు, రాకెట్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని ఆర్టిలరీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అదోష్ కుమార్ తెలిపారు. "మార్క్ 3 ప్రక్రియలో ఉన్న పరికరాల ట్రయల్స్ కోసం సుదూర శ్రేణిలో లాటరింగ్ మందుగుండు సామగ్రిని కొనుగోలు చేయాలని మేము చూస్తున్నాము" అని లెఫ్టినెంట్ జనరల్ కుమార్ చెప్పారు.

పినాకా రాకెట్ల పరిధిని 300 కి.మీ వరకు విస్తరించేందుకు సైన్యం కూడా కృషి చేస్తోందని వివరించారు . పినాకా మార్క్-I గరిష్ట పరిధి 40 కిలోమీటర్లు కాగా, పినాకా మార్క్-II 90 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. దేశంలోని రక్షణ బలగాల కోసం హైపర్‌సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేసేందుకు DRDO బాధ్యతలు చేపట్టిందని, ఇప్పుడు 2,000 కి.మీ పరిధి నిర్భయ్, 400 కి.మీ శ్రేణి ప్రళయ్ క్షిపణుల వంటి సుదూర క్రూయిజ్ , బాలిస్టిక్ క్షిపణులను ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ కుమార్ తెలిపారు. ప్రళయ్, నిర్భయ్ క్షిపణులను పొందేందుకు సైన్యానికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నుండి అనుమతి లభించిందని కూడా తెలిపారు. అంతేకాకుండా పలు డ్రోన్ లను కూడా ప్రవేశపెడుతున్నామని వివరించారు. ఈ డ్రోన్లు శత్రువులే టార్గెట్ గా పని చేస్తాయని వివరించారు. శత్రు స్థావరాల దగ్గరకు వెళ్ళి పేలిపోయేలా వీటిని తీర్చిదిద్దుతున్నామని వివరించారు.

Next Story