ఆ పైలట్ మరణించాడు, తేజస్ ప్రమాదంపై IAF ప్రకటన

ఈ ఘటనలో పైలట్ మరణించినట్టు భారత వైమానిక దళం (IAF) ధృవీకరించింది.

By -  Knakam Karthik
Published on : 21 Nov 2025 6:42 PM IST

National News, Delhi, Indian Air Force, Tejas jet, Dubai Airshow, pilot died

ఆ పైలట్ మరణించాడు, తేజస్ ప్రమాదంపై IAF ప్రకటన

ఢిల్లీ: దుబాయ్ ఎయిర్‌షోలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రదర్శన విమానయానంలో భారత స్వదేశీ యుద్ధ విమానం తేజాస్ కూలిపోయింది. కాగా ఈ ఘటనలో పైలట్ మరణించినట్టు భారత వైమానిక దళం (IAF) ధృవీకరించింది. రెండు సీట్లు ఉన్న ఈ యుద్ధ విమానంలో ట్రైనర్‌ వెర్షన్‌ను కూడా వినియోగిస్తోంది. ఇండియన్ నేవీ కూడా టూ-సీటర్ వేరియంట్‌ను నిర్వహిస్తుంది. టెక్నాలజీ డెమాన్స్‌ట్రేటర్–1 (TD-1) తొలి పరీక్షా విమాన ప్రయోగం 2001లో జరిగింది. రెండో సిరీస్ ప్రొడక్షన్‌ (SP2) టేజాస్ విమానం (IOC కాన్ఫిగరేషన్) తొలి ప్రయాణం 2016 మార్చి 22న జరిగింది.

తేజాస్ గరిష్టంగా 4,000 కిలోల పేలోడ్ మోసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది సింగిల్‌-పైలట్‌, సింగిల్‌-ఇంజిన్‌ విమానంగా పనిచేస్తుంది. దీని గరిష్ట టేక్ఆఫ్‌ బరువు 13,300 కిలోలు. తేజాస్ 4.5-జనరేషన్ మల్టిరోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది ఆఫెన్సివ్ ఎయిర్ సపోర్ట్‌ ఇవ్వడమే కాకుండా భూభాగ ఆపరేషన్లకు క్లోస్ కాంబాట్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. 2016లో తేజాస్‌ను మొదటగా స్వీకరించిన ఐఏఎఫ్ స్క్వాడ్రన్ నంబర్ 45 స్క్వాడ్రన్ – ‘ఫ్లయింగ్ డాగర్స్’. తేజాస్ తన తరగతిలోనే అతి చిన్నది, అతి తేలికపాటి విమానం. కంపోజిట్‌ స్ట్రక్చర్‌ అధికంగా ఉపయోగించటం వల్ల దీని బరువు తగ్గింది. ‘మేక్ ఇన్ ఇండియా’ రక్షణ రంగానికి పెద్ద ఊతంగా, ఈ ఆగస్టులో భారత వాయుసేన కోసం 97 LCA Tejas Mark-1A జెట్‌ల కొనుగోలు ప్రాజెక్ట్‌కు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Next Story