India-US Trade Deal: మార్చిలో సంతకం..ఏప్రిల్ నుండి అమల్లోకి

భారత్ మరియు అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై మార్చి నెలలో సంతకాలు జరిగే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు.

By -  Knakam Karthik
Published on : 20 Feb 2026 6:30 PM IST

National News, India, US Trade Agreement, Piyush Goyal, Indian Economy, International Trade

India-US Trade Deal: మార్చిలో సంతకం..ఏప్రిల్ నుండి అమల్లోకి

భారత్ మరియు అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై మార్చి నెలలో సంతకాలు జరిగే అవకాశం ఉందని, ఏప్రిల్ నుండి ఇది అమలులోకి రానుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఖరారు చేసేందుకు ఫిబ్రవరి 23 నుంచి అమెరికాలో భారత్-అమెరికా అధికారుల మధ్య మూడు రోజుల పాటు కీలక సమావేశం జరగనుంది.

దీంతో పాటు బ్రిటన్, ఒమన్‌ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) కూడా ఏప్రిల్ నుంచే అమలు కానున్నాయని, న్యూజిలాండ్‌తో ఒప్పందం సెప్టెంబర్‌లో పట్టాలెక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భారత్, అమెరికాలు ఈ ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

Next Story