హైపర్‌ సోనిక్‌ మిస్సైల్‌ ప్రయోగం సక్సెస్‌

భారత ఆర్మీ కోసం రూపొందించిన లాంగ్‌ రేంజ్‌ హైపర్‌ సోనిక్ మిస్సైల్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ నుంచి నిన్న దీన్ని ప్రయోగించారు.

By అంజి
Published on : 17 Nov 2024 10:16 AM IST

India, Hypersonic Missile, Rajnath Singh, DRDO

హైపర్‌ సోనిక్‌ మిస్సైల్‌ ప్రయోగం సక్సెస్‌

భారత ఆర్మీ కోసం రూపొందించిన లాంగ్‌ రేంజ్‌ హైపర్‌ సోనిక్ మిస్సైల్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ నుంచి నిన్న దీన్ని ప్రయోగించారు. ఈ హైపర్‌ సోనిక్ మిస్సైల్‌ సాయుధ దళాల కోసం 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వరకు వివిధ పేలోడ్‌లను మోసుకెళ్లేలా రూపొందించబడింది. దీనికి సంబంధించిన వీడియోను రక్షణ శాఖ మంత్రి కార్యాలయం ఎక్స్‌లో షేర్ చేసింది.

హైదరాబాద్‌లోని అబ్దుల్‌ కలాం మిస్సైల్‌ కాంప్లెక్సులో దీన్ని రూపొందించారు. ఇది హిస్టారికల్‌ మూమెంట్‌ అని, సైంటిస్టులను అభినందిస్తున్నానని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని సాధించిందని రాజ్‌నాథ్‌ అన్నారు.

Next Story