భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం
India records first Omicron death in Maharashtra.భారత్‌లో కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది.
By తోట వంశీ కుమార్ Published on 31 Dec 2021 12:04 PM ISTభారత్‌లో కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతి చెందాడు. పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యశ్వంత్ రావు చవాన్ ఆస్పత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల(డిసెంబర్)28న మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అతడు గుండెపోటుతో చనిపోగా.. అనంతరం అతడికి చేసిన పరీక్షల్లో ఒమిక్రాన్‌గా నిర్థరాణ అయినట్లు చెప్పారు
చనిపోయిన వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉందని.. నైజీరియా నుంచి వచ్చినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అతడు గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. 'బాధితుడు మరణానికి కరోనా కారణం కాదు.. కానీ, యాదృచ్ఛికంగా పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబొరేటరీ నివేదిక అతడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారించింది' అని మహా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశంలో ఈ రోజు ఉదయం వరకు 1270 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 450కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్ 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 16, హర్యానాలో 14, ఒడిశాలో 14, పశ్చిమబెంగాల్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 3, జమ్ముకశ్మీర్‌లో 3, అండమాన్ నికోబార్ దీవుల్లో 2, ఉత్తరప్రదేశ్‌లో 2, గోవాలో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లద్దాఖ్‌లో 1, మణిపూర్‌లో 1, పంజాబ్‌లో 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 374 మంది కోలుకున్నారు.