దేశంలో కొత్తగా 6,155 కోవిడ్ కేసులు
India records 6,155 new Covid cases. దేశంలో గడచిన 24 గంటల్లో 6,155 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
By Medi Samrat Published on 8 April 2023 6:40 AM GMTIndia records 6,155 new Covid cases
దేశంలో గడచిన 24 గంటల్లో 6,155 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 31,194కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు ఐదు శాతం దాటి 5.63 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా 9 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,954కి చేరుకుంది. మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన డేటా ప్రకారం.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,41,89,111గా ఉంది.
గత 24 గంటల్లో మొత్తం 1,963 డోస్‌ల వ్యాక్సిన్‌లను అందించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 220.66 కోట్ల వ్యాక్సిన్‌లు టీకాలు వేయబడ్డాయి.
రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమర్జెన్సీ హాట్‌స్పాట్‌లను గుర్తించాలని, పరీక్షలను వేగవంతం చేయాలని, హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంసిద్ధతను నిర్ధారించాలని ఆయన రాష్ట్రాలను ఆదేశించారు.