శతృదేశమైన పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లు పొడిగించి. అందుకు తగినట్లుగానే భారత్ జవాన్లు కూడా వారి కాల్పులను తిప్పికొట్టారు. భారత్ సైన్యం జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన 8 మంది జవాన్లు హతం కాగా, 12 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. భారత్ స్థావరాలే లక్ష్యంగా దాడికి తెగబడింది. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ ఎస్సై రాకేష్ దోహల్‌తో పాటు మరో జవాను, నలుగురు పౌరులు మొత్తం ఆరుగురు మృతి చెందారు.
పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ కు సరైన బుద్ది చెప్పింది భారత ఆర్మీ. పాక్ సైన్యానికి చెందిన స్థావరాలను సైతం భారత ఆర్మీ కూల్చివేసింది. మరో వైపు ఈ కాల్పుల్లో పలు ఇళ్లు సైతం ధ్వంసం అయ్యాయి. భారత్ - పాక్ నియంత్రణ రేఖ వద్ద ఈ కాల్పులు జరిగాయి. పాక్ దుశ్చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.