భారత్ లో కొత్త కరోనా వేరియంట్ టెన్షన్..

India is studying new Covid-19 subvariant 'AY.4.2'. భారతదేశంలో కొత్త కరోనా వేరియంట్ కు సంబంధించిన వార్త ప్రజలను, ప్రభుత్వాలను

By M.S.R  Published on  26 Oct 2021 11:12 AM GMT
భారత్ లో కొత్త కరోనా వేరియంట్ టెన్షన్..

భారతదేశంలో కొత్త కరోనా వేరియంట్ కు సంబంధించిన వార్త ప్రజలను, ప్రభుత్వాలను, ఆరోగ్య నిపుణులను టెన్షన్ పెడుతోంది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో పలువురికి కరోనా కొత్త వేరియంట్ ఏవై.4 (AY.4.2) సోకినట్లు తేలింది. కేంద్ర ఆరోగ్యశాఖ మన్సుఖ్‌ మాండవీయ స్పందించారు. కొత్త వేరియంట్ అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని.. ప్రతి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (NCDC) బృందాలు అధ్యయనం చేస్తాయన్నారు.

ఏవై.4 వేరియంట్ మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో బ‌య‌ట‌ప‌డింది. కోవిడ్ టీకా పూర్తి డోస్ తీసుకొన్న‌ప్ప‌టికీ ఈ వేరియంట్ బారిన ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC) నుంచి వచ్చిన నివేదిక ప్రకారం, ఆరుగురు వ్యక్తులకు ఏవై.4 రకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరి నమూనాలను జన్యు పరీక్ష ల కోసం వైద్యులు సెప్టెంబరులో ఢిల్లీకి పంపారు. బాధితులంతా కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారే. చికిత్స తర్వాత కోలుకున్నా రు. ఈ ఆరుగురు వ్య క్తులతో సన్ని హితంగా ఉన్న మరో 50 మందికి కూడా పరీక్షలు నిర్వహించగా వారంతా ఆరోగ్యంగా ఉన్న ట్లు తేలిందని వైద్యాధికారులు తెలిపారు.

ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లో అన్ని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో రెండు కంటైనర్‌లను ఏర్పాటు చేస్తామని, అత్యవసర పరిస్థితుల్లో ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి తరలించనున్నట్లు తెలిపారు. ఒక్కో కంటైనర్‌లో 200 పడకల సామర్థ్యం ఉంటుందని, వీటిని ఢిల్లీ.. చెన్నై అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలు, రైలు మార్గాల ద్వారా తరలించవచ్చన్నారు.


Next Story