'ఇంతకంటే ప్రభుత్వం ఏం చేయగలదు'?.. నిమిషా ప్రియ‌ ఉరి శిక్షపై కేంద్రం

కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. నిమిషా ప్రియ‌ ఉరి శిక్ష ఖ‌రారు తేదీ జూన్ 16న కాగా.. ఆమె శిక్ష‌ను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలమైంది.

By Medi Samrat
Published on : 14 July 2025 3:28 PM IST

ఇంతకంటే ప్రభుత్వం ఏం చేయగలదు?.. నిమిషా ప్రియ‌ ఉరి శిక్షపై కేంద్రం

కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. నిమిషా ప్రియ‌ ఉరి శిక్ష ఖ‌రారు తేదీ జూన్ 16న కాగా.. ఆమె శిక్ష‌ను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలమైంది. దీంతో ఇప్పుడు నిమిషా ఉరిపై కేంద్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. మేము చేయగలిగినది చేసాము.. ఇది దురదృష్టకరమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పేర్కొంది.

కాగా.. నిమిషాను రక్షించడానికి ఒకే ఒక మార్గం ఉంది, మరణించిన వ్యక్తి కుటుంబం పరిహారం అంగీకరిస్తే, నిమిషా ఉరిని ఆపవచ్చు.

కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి సుప్రీంకోర్టులో ప్రభుత్వ తరఫు వాదనలు వినిపించారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనంలో విచారణ సందర్భంగా మృతుడి కుటుంబానికి 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.5 కోట్లు) పరిహారంగా అందజేస్తామని చెప్పామ‌ని, అయితే వారు అంగీకరించలేదని చెప్పారు.

నిమిషాను జూలై 16న యెమెన్‌లో ఉరి తీయబోతున్నారు. అటార్నీ జనరల్ ప్రకారం.. ఈ విషయం చాలా క్లిష్టంగా ఉంది. ఇందులో ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేకపోతోంది. మేము సాధ్యమైన అన్ని విధాల‌ ప్రయత్నించాము. ఇది దురదృష్టకరం, కానీ ప్రభుత్వానికి కూడా దాని పరిమితులు ఉన్నాయి, ఇంతకు మించి ఏమీ చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు.

2008లో కేరళలోని పాలక్కాడ్‌లో నివాసముంటున్న నిమిషా ప్రియ అనే నర్సు యెమెన్‌లోని ఓ ఆసుపత్రిలో పనిచేసేది. 2011లో భారత్‌లో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న టామీ థామ్సన్‌ను వివాహం చేసుకుని భర్తతో కలిసి యెమెన్‌కు వెళ్లింది. 2012లో నిమిషా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ సమయంలో యెమెన్‌లో అంతర్యుద్ధం పరిస్థితుల కార‌ణంగా థామ్సన్‌ తన కుమార్తెతో భారతదేశానికి తిరిగి వచ్చాడు. నిమిషా యెమెన్‌లోని ఆసుపత్రిలో తన పనిని కొనసాగించింది.

నిమిషా తన స్వంత క్లినిక్‌ని తెరవాలని కోరుకుంది. మహదీ అనే వ్య‌క్తిని తన వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. కానీ మహదీ నిమిషాకు ద్రోహం చేశాడు. మాదకద్రవ్యాల మత్తులో ఉన్న మహదీ నిమిషాను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. నిమిషా పాస్‌పోర్టు కూడా లాక్కున్నాడు. 2017లో నిమిషా మహదీని మత్తులో బంధించి, తన పాస్‌పోర్ట్‌తో యెమెన్‌కు పారిపోయింది. అయితే ఔషధం మోతాదుకు మించి తీసుకోవడంతో మహదీ మృతి చెందాడు. సంఘటన జరిగిన ఒక నెల తర్వాత, పోలీసులు నిమిషాను యెమెన్-సౌదీ సరిహద్దు నుండి అరెస్టు చేశారు.

Next Story