మరోసారి 30వేల దిగువకు కరోనా కేసులు

India Corona Cases. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. రోజూవారీగా నమోదయ్యే కేసులు మాత్రం

By Medi Samrat  Published on  11 Dec 2020 6:29 AM GMT
మరోసారి 30వేల దిగువకు కరోనా కేసులు

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. రోజూవారీగా నమోదయ్యే కేసులు మాత్రం కట్టడిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..గురువారం 8,72,497 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..29,398 కొత్త కేసులు వెలుగుచూశాయి. రెండు రోజుల తరవాత మరోసారి కేసుల సంఖ్య 30 వేల దిగువకు చేరింది. నిర్ధరాణ పరీక్షల్లో తగ్గుదల కూడా కేసులు తగ్గుముఖం పట్టడానికి కారణంగా కనిపిస్తోంది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 97,96,769 మందికి కరోనా వైరస్ సోకింది.

ఇదిలా ఉండగా..ఎప్పటిలాగే క్రియాశీల కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. అలాగే వైరస్‌ నుంచి కోలుకునే వారి సంఖ్య 93 లక్షలకు చేరువవుతోంది. ప్రస్తుతం దేశంలో 3,63,749 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 3.71 శాతానికి తగ్గింది. 92,90,834 మంది వైరస్‌ నుంచి కోలుకోగా..ఆ రేటు 94.84 శాతానికి చేరింది. మరోవైపు, వరసగా ఆరో రోజు కూడా మరణాల సంఖ్య ఐదు వందల లోపుగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 414 మంది కొవిడ్ కారణంగా మరణించగా..మొత్తం మరణాల సంఖ్య 1,42,186కి చేరింది. అలాగే, గత వారం రోజుల్లో పలు రాష్ట్రాల్లో సగటున వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్యను మంత్రిత్వ శాఖ గ్రాఫ్ రూపంలో షేర్ చేసింది.


Next Story