షాకింగ్.. 36 ఏళ్లు గ‌ర్భంతో పురుషుడు..!

In Rare Medical Condition, Nagpur Man Was 'Pregnant' With Twin For 36 Years. మహారాష్ట్ర నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

By Medi Samrat  Published on  24 Jun 2023 5:18 PM IST
షాకింగ్.. 36 ఏళ్లు గ‌ర్భంతో పురుషుడు..!

మహారాష్ట్ర నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో ఓ వ్య‌క్తి గర్భంతో కనిపించాడు. ఉబ్బిన అత‌ని కడుపుని వింత కళ్లతో చూసేవారు. ఆపరేషన్ అయ్యాక ఊహకు కూడా అందని నిజం బయటకు వచ్చింది. నాగ్‌పూర్ నివాసి సంజు భగత్ విష‌యం తెలిసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. భగత్ బాల్యంలో అంద‌రి పిల్ల‌ల‌లానే చాలా సాధారణంగా గ‌డించింది. కానీ ఎదుగుతున్న క్ర‌మంలో సంజు కడుపు ఉబ్బడం మొద‌లైంది. అయితే సంజు కానీ అతని కుటుంబ స‌భ్యులు కానీ దానిపై దృష్టి పెట్టలేదు. దీంతో కడుపు మరింత ఉబ్బింది. దీంతో కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరిగింది.

సంజూ భగత్ ను కూడా స‌నాలు గర్భిణి అని పిలవడం మొదలుపెట్టారు. భగత్ ఉబ్బిన పొట్టను చూస్తే వింతగా అనిపించేది. కానీ 1999 సంవత్సరం నాటికి కడుపులో వాపు బాగా పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఆ తర్వాత సంజు ఆసుపత్రిలో చేరాడు. రోగికి కణితి సమస్య ఉందని వైద్యులు భావించారు. కానీ ఆపరేషన్ ప్ర‌క్రియ‌లో.. కడుపు తెరిచి లోపలి దృశ్యం చూసిన‌ వైద్యులు ఆశ్చర్యపోయారు.

సంజూ కడుపులో వైద్యుల‌కు చాలా ఎముకలు కనిపించాయి.మొదట ఒక కాలు, తర్వాత మరో కాలు, వెంట్రుకలు, చేయి, దవడ అలా శరీరంలోని అనేక ఇతర భాగాలను కనుగొన్నారు. ఈ ఘటన చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వైద్యులు ఇలా జ‌ర‌గ‌డాన్ని వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌గా అభివర్ణించారు. 36 ఏళ్లుగా తన కవల సోదరుడి పిండం సంజూ భగత్ లో ఉన్నట్లు డాక్టర్ అజయ్ మెహతా తెలిపారు.

సంజు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ పిండం కడుపులోకి వచ్చే అవకాశం ఉంది. వైద్యులు ఈ కేసును వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌గా పేర్కొన్నారు. అయితే.. ఈ పిండం గర్భధారణ సమయంలోనే చనిపోయి ఉండాలి. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఇలాంటి కేసులు చాలా అరుదు. భూమిపై 5 మిలియన్ల మందిలో ఒకరికి జరుగుతుంది. అది సంజు భగత్ శ‌రీరంలో జ‌రిగింద‌ని వైద్యులు పేర్కొన్నారు.


Next Story