తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. భారీ స్థాయిలో కొవిడ్‌ థర్డ్ వేవ్‌.. ఐఎంఏ హెచ్చరిక

IMA warns of 'massive' third wave of Covid amid Omicron threat. భారత్‌ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ఛాన్స్‌ ఉందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) హెచ్చరిక జారీ చేసింది.

By అంజి  Published on  7 Dec 2021 9:57 AM GMT
తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. భారీ స్థాయిలో కొవిడ్‌ థర్డ్ వేవ్‌.. ఐఎంఏ హెచ్చరిక

కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ప్రపంచ దేశాలు కలవరానికి గురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ఛాన్స్‌ ఉందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) హెచ్చరిక జారీ చేసింది. కరోనా వైరస్‌కు చెందిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 23 మందికి సోకింది. అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు, మూలం ఉన్న దేశాలలో పరిస్థితులను గమనిస్తుంటే.. ఇది వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెంది, ఎక్కువ మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎంఏ పేర్కొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నుండి బయటపడి ఇప్పుడిప్పుడే సాధారణ జీవనం వైపు సాగుతున్న భారత్‌కు ఇది భారీ ఎదురుదెబ్బ అని, తగిన చర్యలు తీసుకోకపోతే థర్డ్‌ వేవ్‌ రావొచ్చని చెప్పింది.

12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి టీకాలు వేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వేగవంతం చేయాలని వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. "ఈ తరుణంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్మికులు, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు అదనపు మోతాదు (వ్యాక్సిన్) ఇవ్వబడుతుందని అధికారికంగా ప్రకటించాలని ఐఎంఎ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ మొట్టమొదటగా గత నెల చివర్లో దక్షిణాఫ్రికా దేశాలలో కనుగొనబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)చే 'ఆందోళన యొక్క వేరియంట్'గా ఇది వర్గీకరించబడింది. భారత్‌లో కొత్త వేరియంట్‌కు చెందిన 23 కేసులు కనుగొనబడ్డాయి. అంతర్జాతీయ ప్రయాణీకులకు, 'ప్రమాదంలో' ఉన్న దేశాల నుండి వచ్చేవారికి భారత ప్రభుత్వం కఠినమైన చర్యలను అమలు చేసింది. ఈ ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్ ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఫలితాన్ని (72 గంటల కంటే పాతది కాదు) తీసుకుని, గత 14 రోజుల ప్రయాణ వివరాలను ప్రభుత్వ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.

Next Story