రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. ఇద్దరు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో కూలిపోయిందని రక్షణ వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 8 May 2023 12:29 PM ISTరాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. ఇద్దరు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
జైపూర్ : భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో కూలిపోయిందని రక్షణ వర్గాలు తెలిపాయి. మూలాల ప్రకారం.. పైలట్ సురక్షితంగా ఉన్నారని, రక్షణ కోసం సైన్యానికి చెందిన హెలికాప్టర్ ప్రమాద స్థలానికి చేరుకుంది. సూరత్‌గఢ్ నుండి మిగ్-21 బయలుదేరింది. ఆ తర్వాత ప్రమాదం జరిగింది. హనుమాన్‌గఢ్‌లోని డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై మిగ్ - 21 కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పైలట్ పారచూట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. మిగ్-21 పడిన ఇంట్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తిగా గాయపడ్డాడు. అయితే ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు.
జనవరిలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో శిక్షణా వ్యాయామంలో భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు - సుఖోయ్ సు -30, మిరాజ్ 2000 - కూలిపోవడంతో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక యుద్ధ విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూలిపోయింది. గత వారం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఏప్రిల్‌లో కొచ్చిలో ట్రయల్స్ సమయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చేయడంతో మరో ప్రమాదం జరిగింది.
ఈ మార్చిలో ముంబైలో నేవీ హెలికాప్టర్ వీవీఐపీ విధులు నిర్వర్తించిన తర్వాత కూలింది. గత ఏడాది అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన రెండు సంఘటనలు నమోదయ్యాయి. అక్టోబరు 5, 2022లో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతానికి సమీపంలో చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో ఒక భారతీయ ఆర్మీ పైలట్ మరణించాడు.
కేవలం పక్షం రోజుల తర్వాత, ట్యూటింగ్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని సియాంగ్ గ్రామం సమీపంలో కూలిపోయిన ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ (వెపన్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్) - ALH WSI లికబాలి (అస్సాం)లో ఉన్న ఐదుగురు రక్షణ సిబ్బంది మరణించారు. గత ఏడాది జూలై 28న, రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా సమీపంలో ట్విన్-సీటర్ మిగ్-21 ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోవడంతో అందులోని ఇద్దరు పైలట్లు ప్రాణాపాయానికి గురై మరణించారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది .