ఘోర పరాజయం తర్వాత రోహిత్ శర్మ ఏమ‌న్నాడంటే..!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

By Kalasani Durgapraveen  Published on  3 Nov 2024 2:58 PM IST
ఘోర పరాజయం తర్వాత రోహిత్ శర్మ ఏమ‌న్నాడంటే..!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఆదివారం ముంబయిలో మీడియాతో మాట్లాడిన రోహిత్, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా తాను అత్యుత్తమంగా లేనని ఒప్పుకున్నాడు. స్వదేశంలో మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం నా కెరీర్‌లో చాలా కఠినమైన స్థితి అని తెలిపాడు రోహిత్ శర్మ. ఈ ఓటమికి నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను. కెప్టెన్‌గా, నాయకుడిగా సిరీస్ ప్రారంభం నుండి నేను అత్యుత్తమంగా లేనన్నాడు రోహిత్ శర్మ. ఇది దురదృష్టకర సిరీస్, మేము కొన్ని విషయాలను ప్రయత్నించాము. బ్యాటింగ్‌తో పాటు జట్టును నడిపించడంలో కెప్టెన్‌గా అత్యుత్తమంగా లేనన్నాడు రోహిత్ శర్మ. సమిష్టిగా ఒక యూనిట్‌గా పని చేయడంలో విఫలమయ్యామని రోహిత్ శర్మ తెలిపాడు.

కెప్టెన్ టామ్ లాథమ్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర పుటల్లోకెక్కింది. మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో విజయం సాధించి న్యూజిలాండ్ సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. 147 పరుగుల లక్ష్యాన్ని చేధించే విషయంలో టీమిండియా 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ 64 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 6 వికెట్లు పడగొట్టాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీయగా, పేసర్ మాట్ హెన్రీకి ఓ వికెట్ దక్కింది.


Next Story