నాకు సొంత ఇల్లు లేదు, కానీ: ప్రధాని మోదీ

తన పేరు మీద తనకు ఇల్లు లేదని, అయితే తన ప్రభుత్వ చొరవతో దేశంలోని "లక్షల మంది కుమార్తెలు" ఇంటి యజమానులుగా మారారని ప్రధాని మోడీ అన్నారు

By అంజి  Published on  28 Sep 2023 1:49 AM GMT
BJP government, home owners, PM Modi, National news

నాకు సొంత ఇల్లు లేదు, కానీ: ప్రధాని మోదీ

తన పేరు మీద తనకు ఇల్లు లేదని, అయితే తన ప్రభుత్వ చొరవతో దేశంలోని "లక్షల మంది కుమార్తెలు" ఇంటి యజమానులుగా మారారని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్నారు. గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన కోట్లాది మంది మహిళలు ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు నిర్మించుకోవడంతో ఇప్పుడు ‘లక్షాధికారులు’గా మారారని అన్నారు. మంగళవారం నుంచి గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ, గుజరాత్‌లోని గిరిజనులు అధికంగా ఉండే ఛోటాడేపూర్ జిల్లాలోని బోడేలి పట్టణంలో రూ. 5,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. మీతో విశేష సమయం గడిపినప్పటి నుంచి పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషిచేశానని, ఈరోజు తమ ప్రభుత్వం నాలుగు కోట్ల ఇళ్లు కట్టించినందుకు సంతృప్తిగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా, పేదలకు ఇల్లు అనేది మాకు కేవలం సంఖ్య కాదని అన్నారు.

పేదలకు ఇళ్లు కట్టించి వారికి గౌరవం కల్పించే దిశగా కృషి చేస్తున్నాం.. గిరిజనుల అవసరాల మేరకు ఇళ్లు కట్టిస్తున్నాం, అది కూడా మధ్య దళారులు లేకుండా.. లక్షల్లో ఇళ్లను నిర్మించి మహిళల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించాం. నా పేరు మీద ఇంతవరకు ఇల్లు లేకపోయినా, లక్షలాది మంది కూతుళ్లను తమ ప్రభుత్వం ఇంటి యజమానులుగా చేసింది’’ అని అన్నారు. గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన వర్గాల మహిళలు ఇప్పుడు 'లఖపతి దీదీ'లుగా మారారు, ఎందుకంటే వారి పేర్లపై నమోదు చేయబడిన ఈ గృహాల విలువ ఇప్పుడు దాదాపు రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు ఉందని అన్నారు.

గాంధీనగర్‌లోని విద్యాసమీక్ష కేంద్రంగా పిలువబడే గుజరాత్ విద్యాశాఖ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాను ఎంతగానో ఆకట్టుకుందని, దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ప్రారంభించాలని ఆయన కోరారు మరియు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందని చెప్పారు. "ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఇటీవల విద్యా సమీక్షా కేంద్రాన్ని సందర్శించారు. మా సమావేశంలో, భారతదేశంలోని అన్ని జిల్లాల్లో ఇటువంటి కేంద్రాలను ప్రారంభించాలని ఆయన నన్ను కోరారు. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందని నాకు చెప్పారు" అని మోడీ చెప్పారు.

రాష్ట్రంలో విద్య నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన 'మిషన్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ప్రాజెక్ట్ కింద విద్యా రంగానికి సంబంధించిన రూ. 4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను బోడేలిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త తరగతి గదులు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా సందిగ్ధంలో ఉన్న కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)ని ఎట్టకేలకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రధాని చెప్పారు.

Next Story