ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'డెస్టినేషన్ ఉత్తరప్రదేశ్' కాన్క్లేవ్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. గోరఖ్ పూర్ మఠాధిపతిగా ఉన్న తనను రాజకీయాల వైపు నడిపించిన పరిస్థితుల గురించి తెలిపారు. ఆయన ఉత్తరప్రదేశ్ లో జరిగిన రెండు సంఘటనలను వివరిస్తూ.. అవే రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయని తెలిపారు. 1994-1995లో గోరఖ్‌పూర్‌లో రెండు పెద్ద భవనాలు ఉండే పేరున్న కుటుంబం ఉండేదని ఆయన అన్నారు. ఆ భవనాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాఫియాకు కేటాయించింది. యోగి ఆదిత్యనాథ్ ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు ఆ కుటుంబం రెండు భవనాలను కూల్చివేసినట్లు చెప్పారు. ఎందుకు అని అడిగినప్పుడు, వారు అలా కూల్చి వేయడంతో కనీసం భూమిని నిలుపుకోగలుగుతామని భావించామని చెప్పారు. భవనాలను కూల్చివేయకపోతే, మాఫియాకు చెందిన వారు భవనాలను, భూమిని స్వాధీనం చేసుకునేవాళ్లని, తమకు ఏమీ లేకుండా పోయేదని అన్నారు.
ఒక రోజు, ఒక ధనిక కుటుంబం నుండి తమకు ఫోన్ వచ్చిందని, తమ ఆస్తులను మంత్రి ఆక్రమిస్తున్నారని చెప్పారు. యోగి అక్కడికి చేరుకున్నప్పుడు, వస్తువులు ఇంట్లో నుండి అప్పటికే విసిరేశారు. జనం చూస్తూ ఉండిపోయారు. యజమాని తన ఆస్తిని వారికి అమ్మలేదు, అయినా దీన్ని ఎలా చూస్తూ ఉంటారని యోగి ఆదిత్యనాథ్ మాఫియా నాయకులను అడగ్గా.. మాఫియా ఆయన ముఖంపై కొన్ని కాగితాలను విసిరారు. ఆ సమయంలోనే యోగి ఆదిత్యనాథ్ స్థానికులతో కలిసి ప్రతిఘటించారు. ఈ రెండు సంఘటనలు. యోగి ఆదిత్యనాథ్ రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఎవరూ అలాంటి కార్యకలాపాలు నిర్వహించలేరని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.