మానవ దంతాలు మారణాయుధాలు కాదు : హైకోర్టు

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 324 ప్రకారం మానవ దంతాలను "మారణాత్మక ఆయుధాలుగా" పరిగణించరాదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు రివ్యూ పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించింది.

By -  Medi Samrat
Published on : 11 Sept 2025 8:30 PM IST

మానవ దంతాలు మారణాయుధాలు కాదు : హైకోర్టు

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 324 ప్రకారం మానవ దంతాలను "మారణాత్మక ఆయుధాలుగా" పరిగణించరాదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు రివ్యూ పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించింది. ప్రమాదకరమైన ఆయుధాలతో ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు ఈ విభాగంలో శిక్ష విధించే నిబంధన ఉంది. దంతాల వల్ల కలిగే గాయం ఐపీసీ సెక్షన్ 324 పరిధిలోకి రాదని న్యాయమూర్తి రాకేష్ కైంతల తీర్పులో పేర్కొన్నారు. అందువల్ల, ఐపిసి సెక్షన్ 324 ప్రకారం.. శిక్షార్హమైన నేరానికి నిందితులను దోషిగా నిర్ధారించి, శిక్ష విధించడంలో ట్రయల్ కోర్టు తప్పు చేసింది.

కేసు ప్రకారం.. మార్చి 5, 2007న, బాధితురాలు తన 4 ఏళ్ల చిన్నారితో నిద్రిస్తోంది. ఆ తర్వాత రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఏదో శబ్దం వినిపించింది. ఆమె తన గదిలో నిందితుడిని చూసింది. నిందితుడు తనను, తన బిడ్డను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడ‌ని, ముద్దుపెట్టి, వేధించారని, చెంపపై కొరికాడ‌ని ఫిర్యాదులో తెలిపింది.

భారతీయ శిక్షాస్మృతిలోని 451, 354, 323, 324 సెక్షన్ల కింద ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. సెషన్స్ కోర్టు.. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ బాధితురాలి వాంగ్మూలం వైద్య సాక్ష్యంతో సరిపోలిందని పేర్కొంది. ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశాడు. బాధితురాలు అదే రాత్రి 1:45 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసిందని, దీంతో బాధితురాలి వాంగ్మూలం కట్టుకథగా ఉండే అవకాశం లేకుండా పోయిందని కోర్టు గుర్తించింది.

ప్రమాదకరమైన ఆయుధాలతో స్వచ్ఛందంగా గాయపరిచినందుకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 324 ప్రకారం నేరం చేసినందుకు ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించడాన్ని తప్పుపట్టిందని కోర్టు పేర్కొంది. అయితే భారతీయ శిక్షాస్మృతిలోని 451, 354, 323 సెక్షన్ల ప్రకారం శిక్షార్హమైన నేరాలకు ట్రయల్ కోర్టు విధించిన శిక్షలు ఎక్కువగా ఉండరాదని, బాధితురాలు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటం.. నిందితుడు ఆమెను ఏదైనా చేయాల‌నే అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని కూడా కోర్టు పేర్కొంది. "ఇంటిని మనిషి కోటగా పరిగణిస్తారు, అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడటం తీవ్రమైన నేరం" అని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల.. కోర్టు అప్పీల్‌ను పాక్షికంగా అనుమతించింది. IPC సెక్షన్ 324 కింద ఆర్డర్‌ను రద్దు చేసింది.

Next Story