త్వరలో పీఎం కిసాన్ నిధుల జమ.. కొత్త రైతులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులకు జమకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 21 Feb 2025 6:53 AM IST
త్వరలో పీఎం కిసాన్ నిధుల జమ.. కొత్త రైతులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులకు జమకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 24న బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో సుమారు 9 కోట్ల 70 లక్షల మంది అర్హులైన రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.2 వేల చొప్పున జమ చేయనున్నారు. రైతులు 19వ విడత పీఎం కిసాన్ కింద రూ.2 వేలు అందుకోవాలంటే రైతులు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్, ఈ కేవైసీ పూర్తి అయ్యాయో లేదా తప్పక చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. .దీని కోసం pmkisan.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి. ఇప్పటికీ చాలా మంది రైతులు ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలాగో ఇప్పుడు చూద్దాం..
- ఈ స్కీమ్ కింద రిజిస్టర్ చేయాలంటే ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inని విజిట్ కావాలి.
- ఆ తర్వాత కొత్త రైతు రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీరు క్లిక్ చేసిన వెంటనే.. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, రాష్ట్రం వంటి సమాచారాన్ని నింపాలి.
- ఆ తర్వాత, పేజీ దిగువన కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, గెట్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీరు ఇక్కడ రిజిస్ట్ చేసి ఆపై సబ్మిట్ ఆప్షన్ కూడా క్లిక్ చేయాలి.
- మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్న కనిపిస్తుంది. అప్పుడు మీరు ఎస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత, మీ ముందు ఒక రిజిస్ట్రేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, రాష్ట్రం, జిల్లా, బ్లాక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, భూమికి సంబంధించిన సమాచారాన్ని నింపాలి. భూమి రికార్డులు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ స్కాన్ చేసిన కాపీ ఇతర అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
- చివరగా కింద సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీరు ఈ స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
దీనికి సంబంధించి ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని రైతు సేవా కేంద్రాలు లేదా అగ్రికల్చర్ ఆఫీసర్‌ను సంప్రదించాలి.