8th Pay Commissionతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెర‌గ‌నున్నాయో ఇక్క‌డ తెలుసుకోండి

8వ వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది జనవరి 2026 నుండి అమలులోకి రావచ్చు.

By Medi Samrat  Published on  4 Feb 2025 3:00 PM IST
8th Pay Commissionతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెర‌గ‌నున్నాయో ఇక్క‌డ తెలుసుకోండి

8వ వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది జనవరి 2026 నుండి అమలులోకి రావచ్చు. 1 కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు దీని ద్వారా లబ్ది పొందనున్నారు. 8వ వేతన సంఘంతో స్థాయి వారీగా కేంద్ర ఉద్యోగుల జీతంలో ఎంత మార్పు ఉంటుందో తెలుసుకుందాం.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను బట్టి 8వ పే కమిషన్‌లో జీతం పెంపు ఉంటుంది. 1.92 నుంచి 2.86 మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గరిష్ఠ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఆమోదం పొందితే స్థాయిల వారీగా కేంద్ర ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం.

లెవెల్ 1.. ఇందులో ప్యూన్‌లు, అటెండర్లు, సహాయక సిబ్బంది ఉన్నారు. వారి ప్రస్తుత మూల వేతనం రూ.18,000. ఇది 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ద్వారా రూ.51,480కి పెరగవచ్చు. అంటే జీతం రూ.33,480 పెరగనుంది.

లెవెల్ 2.. లోయర్ డివిజన్ క్లర్క్‌లు ఉంటారు. వీరి మూల వేతనం ప్రస్తుతం రూ.19,900. 8వ వేతన సంఘం అమలులోకి వస్తే ఇది రూ.56,914కు పెరగవచ్చు. అంటే ఈ ఉద్యోగులు రూ.37,014 పెంపును పొందవచ్చు.

లెవల్ 3లో కానిస్టేబుల్స్ లేదా నైపుణ్యం కలిగిన సిబ్బంది ఉంటారు. ప్రస్తుతం రూ.21,700 ప్రాథమిక వేతనం పొందుతున్నారు. 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో వారి వేతనం రూ.40,362 పెరిగి రూ.62,062కి చేరనుంది.

లెవల్ 4లో గ్రేడ్ D స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లర్క్ ఉంటారు. ప్రస్తుతం వీరి మూల వేతనం రూ.25,500. 8వ వేతన సంఘం తర్వాత ఇది రూ.72,930కి పెరగవచ్చు. అంటే రూ.47,430 పెరుగుతుంది.

లెవల్ 5లో సీనియర్ క్లర్కులు, ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బంది ఉంటారు. ప్రస్తుతం వీరి ప్రాథమిక వేతనం రూ.29,200 కాగా.. 8వ వేత‌న స‌వ‌ర‌ణ‌ల త‌ర్వాత రూ.54,312 పెరిగి.. రూ. 83,512 ఉంటుందని అంచనా.

లెవల్ 6లో ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు ఉంటారు. వీరి ప్రాథమిక వేతనం రూ. 35,400. ఇది రూ.65,844 పెరిగి రూ. 1,01,244 కావచ్చు.

స్థాయి 7లో సూపరింటెండెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు ఉంటారు. అతని ప్రాథమిక వేతనం రూ.44,900 కాగా.. దానిని రూ.1,28,414కు పెంచవచ్చు. వీరికి రూ.83,514 పెరగనుంది.

లెవల్ 8లో సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు ఉంటారు. వీరి మూల వేతనం నెలకు రూ.47,600. 8వ వేతన సంఘం తర్వాత ఇది రూ.1,36,136కు పెరగవచ్చు. అంటే రూ.88,536 పెరగనుంది.

లెవెల్ 9లో డిప్యూటీ సూపరింటెండెంట్‌లు, ఖాతా అధికారులు ఉంటారు. ప్రస్తుతం వీరి ప్రాథమిక వేతనం రూ.53,100. ఇది రూ.98,766 పెరగవచ్చు. అప్పుడు వారికి ప్రతి నెలా రూ.1,51,866 అందుతుంది.

లెవల్ 10లో గ్రూప్ A ఆఫీసర్లు వంటి సివిల్ సర్వీసెస్‌లో ఎంట్రీ లెవల్ ఆఫీసర్లు ఉంటారు. ప్రస్తుతం ప్రతి నెలా రూ.56,100 బేసిక్ వేతనం పొందుతున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86తో వారి బేసిక్ పే రూ.1,60,446 కావచ్చు.. అంటే రూ.1,04,346 పెరుగుతుంది.

Next Story