రాత్రి 12:30 గంటలకు విద్యార్థిని బయటకు ఎలా వెళ్లింది.? ఈ ఘటనకు ఎవరు బాధ్యులు..?
పశ్చిమ బెంగాల్ మరోసారి వార్తల్లో నిలిచింది. దుర్గాపూర్‌లో 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన అందరినీ కలిచివేసింది.
By - Medi Samrat |
పశ్చిమ బెంగాల్ మరోసారి వార్తల్లో నిలిచింది. దుర్గాపూర్‌లో 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన అందరినీ కలిచివేసింది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ విషయంపై మౌనం వీడారు. దీనిపై మమతా బెనర్జీ కాలేజీ యాజమాన్యంపై ప్రశ్నలు సంధించారు. రాత్రి 12:30 గంటలకు విద్యార్థిని బయటకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. ఈ ఘటన దిగ్భ్రాంతికరమని ఆమె అన్నారు. ఇలాంటి ఘటనలను మా ప్రభుత్వం ఏమాత్రం సహించదన్నారు.
మీడియాతో మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ.. బాధితురాలు ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది.. ఈ ఘటనకు ఎవరు బాధ్యులు..? రాత్రి 12:30 గంటలకు ఎలా బయటకు వచ్చింది.? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఘటన అటవీ ప్రాంతంలో జరిగింది అని తెలుసు కాబట్టి 12.30కి ఏం జరిగిందో తెలీదు విచారణ జరుగుతోంది.. పోలీసులు విచారణ చేస్తున్నారు, ఎవరినీ విడిచిపెట్టరు, దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎవరూ తప్పించుకోరు. మమతా బెనర్జీ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుంది. ప్రైవేట్ కళాశాలలు కూడా క్యాంపస్ చుట్టూ గట్టి భద్రతను అమలు చేయాలని సూచించారు.
ప్రతిపక్షాలు ఈ విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో సీఎం మమత కూడా బదులిచ్చారు. 'మూడు వారాల క్రితం ఒడిశాలోని బీచ్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిగిందని, ఒడిశా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని, బెంగాల్‌లో మహిళలకు ఏదైనా జరిగితే, మేము దానిని సాధారణ విషయంగా పరిగణించము, అది తీవ్రమైన విషయమని మీరు నాకు చెప్పండి' అని ఆమె అన్నారు. 'ఇతర రాష్ట్రాల్లో ఇలా జరిగినా.. ఖండించదగినది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో కూడా ఇలాంటి కేసులు చాలానే చూశాం కాబట్టి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.