పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మే 7న సమర్థవంతమైన పౌర రక్షణ కోసం డ్రిల్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ (MHA) అనేక రాష్ట్రాలను కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ డ్రిల్ సమయంలో, వైమానిక దాడులకు సంబంధించిన హెచ్చరికల సైరన్‌లు మోగుతాయి. శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసే దిశగా ఈ చర్యలు చేపట్టింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని సూచించింది. మాక్ డ్రిల్స్ సందర్భంగా భద్రతా సన్నద్ధతపై సాధారణ పౌరులకు కూడా అవగాహన కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. భారత పోస్టులపై పాకిస్తాన్ పదే పదే సరిహద్దులో కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు మాక్ డ్రిక్ చేపట్టాలని సలహా వచ్చింది.