హిందూస్థానీ భావు అలియాస్ వికాస్ పాఠక్ అరెస్ట్

Hindustani Bhau arrested in Mumbai for 'instigating' students. హిందూస్థానీ భావు.. మీమ్స్ లోనూ వైరల్ వీడియోల లోనూ కనిపిస్తూ ఉంటాడు.

By M.S.R  Published on  1 Feb 2022 11:00 AM IST
హిందూస్థానీ భావు అలియాస్ వికాస్ పాఠక్ అరెస్ట్

హిందూస్థానీ భావు.. మీమ్స్ లోనూ వైరల్ వీడియోల లోనూ కనిపిస్తూ ఉంటాడు. తాజాగా అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులను రెచ్చగొట్టాడనే ఆరోపణలతో అతడి అరెస్ట్ చోటు చేసుకుంది. హిందూస్థానీ భావు నిరసనలకు దిగండని విద్యార్థులను ప్రేరేపించినందుకు ముంబై పోలీసులు అరెస్టు చేశారు. హిందుస్థానీ భావు తన అరెస్టుకు ముందు బెయిల్ కోసం లాయర్లను సంప్రదించాడని కూడా తెలుస్తోంది. ఈ ఘటనపై హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ విచారణకు ఆదేశించారు. సోమవారం ముంబైలోని ధారవిలో విద్యార్థులు నిరసన తెలిపారు. కోవిడ్ -19 సంక్షోభం మధ్య 10 మరియు 12వ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో, సోమవారం, 10 మరియు 12 వ తరగతి విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించాలని కోరుతూ వీధుల్లోకి వచ్చారు. ముంబైలోని ధారవిలో విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ బంగ్లాను విద్యార్థులు ఘెరావ్ చేశారు. ఈ సమయంలో వందల సంఖ్యలో గుమిగూడిన విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో 10, 12 పరీక్షలు సకాలంలో జరుగుతాయని, ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని మంత్రి వర్షా గైక్వాడ్ ఆదివారం తెలిపారు. పరీక్ష సమయాన్ని పొడిగించాలని, ఆన్‌లైన్ విధానంలో పరీక్ష పెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.


Next Story