గుజ‌రాత్ తీరంలో భారీగా హెరాయిన్ పట్టివేత

Heroin worth Rs 400 cr seized from Pak boat off Gujarat coast.మాద‌క‌ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రాపై కేంద్ర‌ప్ర‌భుత్వంతో పాటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2021 9:19 AM IST
గుజ‌రాత్ తీరంలో భారీగా హెరాయిన్ పట్టివేత

మాద‌క‌ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రాపై కేంద్ర‌ప్ర‌భుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్ర‌మంలో త‌నిఖీలు చేస్తూ మాద‌క‌ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రాను అడ్డుకుంటున్నాయి. తాజాగా గుజ‌రాత్ తీరంలో భారీగా హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. భారత రక్షణ దళం, గుజరాత్‌ ఏటీఎస్‌ సంయుక్తంగా గుజరాత్‌ తీరంలో ఆపరేషన్‌ నిర్వహించాయి. భార‌త జ‌ల్లాలోకి ప్ర‌వేశించిన పాకిస్థాన్ ప‌డ‌వ‌లో హెరాయిన్ త‌ర‌లిస్తుండ‌గా గుర్తించారు. రూ.400కోట్ల విలువైన 77కిలోల హెరాయిన్‌ను అధికారులు సీజ్ చేశారు. డ్ర‌గ్స్ త‌ర‌లిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక మహారాష్ట్రలోని 626 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్ల‌లో క‌ర్ణాటక నుంచి షోలాపూర్ మీదుగా స‌తారాకు తీసుకెలుతున్న గంజాయిని షోలాపూర్‌లో ప‌ట్టుకున్నారు. రెండు కార్ల‌ను సీజ్ చేయ‌డంతో పాటు ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు. దీని విలువ రూ.1.26కోట్లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. నిందితులపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Next Story