వేగంగా కదులుతున్న రైళ్లోంచి దూకి.. రైలు కింద పడబోయిన మహిళ.. కాపాడిన ఆర్పీఎఫ్ ఎస్ఐ

Hero Cop Saves Woman From Falling Under Train In Bengal. వేగంగా కదులుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు నుండి దిగడానికి ప్రయత్నిస్తూ బ్యాలెన్స్‌ కోల్పోయిన ఓ మహిళ.. రైలు, ఫ్లాట్‌ఫామ్‌ మధ్యలో పడిపోయింది.

By అంజి  Published on  3 Dec 2021 11:07 AM IST
వేగంగా కదులుతున్న రైళ్లోంచి దూకి.. రైలు కింద పడబోయిన మహిళ..  కాపాడిన ఆర్పీఎఫ్ ఎస్ఐ

వేగంగా కదులుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు నుండి దిగడానికి ప్రయత్నిస్తూ బ్యాలెన్స్‌ కోల్పోయిన ఓ మహిళ.. రైలు, ఫ్లాట్‌ఫామ్‌ మధ్యలో పడిపోయింది. ఇది గమనించిన డ్యూటీలో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి వెంటనే మహిళ ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన బెంగాల్‌లోని పురూలియా రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. రైల్వేస్ ట్వీట్ చేసిన సీసీ టీవీ ఫుటేజ్‌లో.. ఇద్దరు మహిళలు సంత్రాగచ్చి-ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వెళ్తుంటే.. అందులో నుండి దూకడం కనిపించింది. వారిలో ఒకరు ప్లాట్‌ఫారమ్‌పై దిగగా, మరొకరు తన బ్యాలెన్స్‌ను కోల్పోయి రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య చిక్కుకుపోయారు.

తమ వారు రైలు ఎక్కలేదనే కారణంగా వారు రైలు నుంచి ఫ్లాట్‌ఫామ్‌ మీదకు దూకారని తెలిసింది. ఆర్పీఎఫ్‌ సబ్-ఇన్‌స్పెక్టర్ బబ్లూ కుమార్ పరిగెత్తుకుంటూ వచ్చి, సరిగ్గా సమయానికి ఆమెను ప్లాట్‌ఫారమ్‌పైకి లాగాడు. మహిళను రక్షించడానికి ప్రయాణికులు ఆమె దగ్గరకు పరుగెత్తారు. కదులుతున్న రైళ్లను ఎక్కడం, దిగడం పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు పదే పదే హెచ్చరించినా, విజ్ఞప్తి చేసినా ప్రయాణికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఒక ప్రయాణికుడు ప్లాట్‌ఫారమ్‌పై నుంచి కదులుతున్న రైలు ఎక్కుతుండగా సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. మ‌హిళ ప్రాణాలు కాపాడిన స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌పై రైల్వే అధికారులు ప్ర‌శంస‌లు కురిపించారు.


Next Story