IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆంధ్ర క్రికెటర్ కీలక రోల్

భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానీ ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి)కి కొత్త ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.

By Kalasani Durgapraveen  Published on  17 Oct 2024 1:14 PM GMT
IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆంధ్ర క్రికెటర్ కీలక రోల్

భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానీ ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి)కి కొత్త ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఐపిఎల్ 2025 వేలానికి ముందు క్రికెట్ ఫ్రాంచైజీ డైరెక్టర్‌గా మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు నియమితులయ్యారు. వేణుగోపాల్ రావు తెలుగు వ్యక్తి అన్న సంగతి చాలా మందికి తెలిసిందే. సత్తా ఉన్నా ఐపీఎల్ టైటిల్ ను అందుకోలేకపోతున్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒకటి. ఈ మార్పుల కారణంగా అయినా ఢిల్లీ తలరాత మారుతుందేమో చూడాలి.

ప్రధాన కోచ్‌గా ఏడేళ్ల పదవీకాలం ఇటీవల ముగియడంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్థానంలో బదానీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పాంటింగ్ కోచింగ్ లో క్యాపిటల్స్‌ మంచి ప్రదర్శన చేసినా ట్రోఫీని మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. అందుకే ఫ్రాంచైజీ తన క్రికెట్ కార్యకలాపాలపై సరైన క్లారిటీతో ముందుకు వెళ్లాలని చూస్తోంది.

బదానీ, తమిళనాడు మాజీ కెప్టెన్, భారతదేశం తరపున నాలుగు టెస్టులు, 40 వన్డేలు ఆడాడు, అయితే కోచ్‌గా మంచి పేరును సంపాదించాడు. గతంలో చెపాక్ సూపర్ గిల్లీస్‌ జట్టు మూడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) టైటిళ్లు సొంతం చేసుకోడానికి కారణమయ్యాడు. R సాయి కిషోర్ వంటి ప్రతిభను వెలికితీయడంలో బదానీ కీలక పాత్ర పోషించాడు. వేణుగోపాలరావు డైరెక్టర్‌గా డీసీ అన్ని క్రికెట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. JSW గ్రూప్ క్రికెట్ డైరెక్టర్‌గా సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు.


Next Story