సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యంపై.. తాజా హెల్త్‌ బులెటిన్‌..!

Health update of hero rajinikanth. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా ఆరోగ్య పరిస్థితి కావేరి ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా

By అంజి
Published on : 29 Oct 2021 6:54 PM IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యంపై..  తాజా హెల్త్‌ బులెటిన్‌..!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా ఆరోగ్య పరిస్థితి కావేరి ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపాయి. సంవత్సరానికి ఒకసారి రజనీకాంత్‌కు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమేనని వైద్యులు తెలిపారు. ఆయన బ్రెయిన్‌ రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించాం..వాటికి సంబంధించిన చికిత్స చేసి, వాటిని తొలగించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్‌ అవుతరాని కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

గురువారం సాయంత్రం 4.30గంట‌ల‌కు చైన్నైలోని కావేరి ఆస్ప‌త్రిలో సౌత్ఇండియా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చేరారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సాధార‌ణ హెల్త్ చెక‌ప్ కోసం ఆయ‌న ఆస్ప‌త్రికి చేరార‌ని కుటుంబసభ్యులు చెప్పారు. 70 ఏళ్ల రజ‌నీ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తీసుకోవడం కోసం ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అనంత‌రం రెండు రోజుల క్రిత‌మే ఆయ‌న చెన్నైకి వ‌చ్చారు.

ఇదిలా ఉంటే.. ఆయ‌న న‌టించిన 'అన్నాత్తే' చిత్రం తెలుగు 'పెద్ద‌న్న' పేరుతో దీపావ‌ళి కానుక‌గా ఈ నెల 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా నిన్న చిత్ర‌బృందం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

Next Story