యువత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేయడానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. మార్చి 12 వరకే దరఖాస్తు గడువు ముగియగా.. మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా దేశంలోని 730కిపై జిల్లాల్లో లక్ష మందికిపైగా యువతకు టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఉంది. ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థులకు నెలకు రూ.5 వేల చొప్పున ఏడాది పాటు స్టైఫండ్ ఇస్తారు.
ప్రతి ఇంటర్న్‌లకు ఖర్చుల కోసం అదనంగా రూ.6 వేలు ఇస్తారు. అందేకాదు ఇంటర్న్‌లకు బీమా కవరేజీ కూడా లభిస్తుంది. అభ్యర్థులు గరిష్ఠంగా మూడు ఇంటర్న్‌షిప్ పోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా దూర విద్య ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న అభ్యర్థులు, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీఫార్మసీ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాల కోసం WWW.pminternship.mca.gov.inను విజిట్ చేయండి.