వ్యాక్సిన్‌ తీసుకున్నా.. కరోనా బారిన పడ్డ హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి.!

Haryana Minister, Who Got Trial Dose Of Covid Vaccine, Tests Positive. హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్.. భారత్

By Medi Samrat  Published on  5 Dec 2020 8:43 AM GMT
వ్యాక్సిన్‌ తీసుకున్నా.. కరోనా బారిన పడ్డ హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి.!

హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్.. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకా 'కోవాక్సీన్' మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా నవంబర్‌ 20న తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన తాజాగా కరోనా బారిన పడ్డారు. దీంతో వ్యాక్సిన్ ప‌నితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. క‌రోనా బారిన ప‌డ్డ‌ అనిల్‌ విజ్ ప్రస్తుతం అంబాలా కాంట్ లోని సివిల్ ఆసుపత్రిలో చేరినట్లు‌ తెలియజేశారు.కాగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాలని అనిల్ విజ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంత‌కుముందు అనిల్ విజ్‌కు నవంబర్‌ 20న ఇదే ఆసుపత్రిలో కోవిడ్‌-19 టీకా కోవాక్సిన్‌ ఇచ్చారు.

భారత్ బయోటెక్.. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌‌)ల సహకారంతో.. కోవ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేస్తోంది. అయితే మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో కోవ్యాక్సిన్ ఉత్తమ ఫలితాలు వ‌చ్చాయి. దీంతో డ్రగ్ కంట్రోల్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా(డీజీసీఐ) అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మూడోదశ ట్రయల్స్‌లోనే మొదటి వాలంటీర్‌గా అనిల్ విజ్ ముందుకొచ్చారు.


Next Story