రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్..ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
హర్యానా రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది.
By - Knakam Karthik |
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్..ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
హర్యానా రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ధిక్కరించి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐదుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి కాకుండా ఇతర అభ్యర్థులకు ఓటు వేశారని భావిస్తున్న ఐదుగురు శాసనసభ్యులపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. నోటీసులు అందుకున్న వారిలో మహమ్మద్ ఇలియాస్, మహమ్మద్ ఇస్రాయెల్, రేణు బాలా, శైలీ చౌదరి మరియు జర్నైల్ సింగ్ ఉన్నారు.
ఎన్నికల సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేయడానికి గల కారణాలను వివరించాలని హైకమాండ్ వీరిని ఆదేశించింది. నిర్ణీత సమయంలోగా తమ వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం హర్యానా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Haryana | Congress has issued show-cause notices to five MLAs who allegedly cross-voted during the Rajya Sabha election.The five legislators who have been served notices are Muhammad Ilyas, Muhammad Israil, Renu Bala, Shaili Chaudhary, and Jarnail Singh. The party has sought…
— ANI (@ANI) March 20, 2026