ఐపీఎస్ పురాణ్ కుమార్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ ఏఎస్‌ఐ ఆత్మ‌హ‌త్య

దివంగత ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హర్యానాలోని రోహ్‌తక్‌లోని ఓ పోలీసు అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

By -  Medi Samrat
Published on : 14 Oct 2025 3:58 PM IST

ఐపీఎస్ పురాణ్ కుమార్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ ఏఎస్‌ఐ ఆత్మ‌హ‌త్య

దివంగత ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హర్యానాలోని రోహ్‌తక్‌లోని ఓ పోలీసు అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురన్ కుమార్ అక్టోబర్ 7న ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో 16 మంది సీనియర్ IAS, IPS అధికారుల పేర్లు రాసిన ఆయ‌న‌.. వారి వేధింపులే తన ఆత్మ‌హ‌త్యకు కారణమని పేర్కొన్నారు

రోహ్‌తక్‌లోని సైబర్ సెల్ ప‌నిచేస్తున్న‌ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) సతీష్ లాథర్ మూడు పేజీల సూసైడ్ నోట్, వీడియో సందేశాన్ని వదిలి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. అందులో అతను పురాణ్ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. వై పురాణ్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏఎస్‌ఐ విచారణ చేపట్టాల‌ని డిమాండ్ చేశాడు. తన సూసైడ్ నోట్‌లో ASI కుమార్‌ను "అవినీతి అధికారి"గా అభివర్ణించాడు. అతనికి వ్య‌తిరేకంగా "సరిపడిన సాక్ష్యాలు" ఉన్నాయని పేర్కొన్నాడు.

అరెస్టుకు భయపడి పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, "కులతత్వాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వ్యవస్థను హైజాక్ చేశాడ‌ని" ఆరోపించారు. ‘నా ప్రాణాలను బలిపెట్టి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను.. ఆ అవినీతి కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు’ అని ఏఎస్ఐ తన నోట్‌లో రాశారు.

Next Story