కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. హార్దిక్ పటేల్ రాజీనామా

Hardik Patel quits Congress months ahead of Gujarat polls.గుజ‌రాత్ రాష్ట్రంలో మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2022 11:33 AM IST
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. హార్దిక్ పటేల్ రాజీనామా

గుజ‌రాత్ రాష్ట్రంలో మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రగ‌నున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చాడు పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ ప‌టేల్. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట కార‌ణంగానే ఆయ‌న ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ కొద్ది రోజులుగా పార్టీ విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.

కాగా..బుధ‌వారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. గుజ‌రాతీ ప్ర‌జ‌లు త‌న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తార‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి పంప‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

'నేను కాంగ్రెస్ పార్టీకి, ప‌ద‌వికి, పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నా. నా నిర్ణ‌యాన్ని నా స‌హ‌చ‌రులు, గుజ‌రాత్ ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తార‌ని అనుకుంటున్నా. గుజ‌రాత్ రాష్ట్రం కోసం భ‌విష్య‌త్తులో మ‌రింత ఉత్త‌మంగా ప‌నిచేయ‌డానికి ఈ అడుగు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బావిస్తున్నా' అంటూ హార్థిక్ ఆ లేఖ‌లో తెలిపాడు.


Next Story