ముంబైలోని ప్రఖ్యాత లీలావతి హాస్పిటల్ ప్రాంగణంలో చేతబడి నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. మానవ ఎముకలు, పుర్రెలు, వెంట్రుకలు, బియ్యం, క్షుద్ర పూజలకు సంబంధించిన ఇతర వస్తువులు ఉన్న ఎనిమిది కలశాలను కనుగొన్నారు. ప్రస్తుత ట్రస్టీల కార్యాలయం కింద వీటిని పాతిపెట్టినట్లు కనుగొన్నారు. మాజీ ఉద్యోగుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా తవ్వకాలు నిర్వహించారు. అదే సమయంలో వీడియోను రికార్డు చేశారు.
ముంబై లీలావతి ఆసుపత్రి ఆవరణలో మాజీ ట్రస్టీలు క్షుద్ర పూజలు చేశారని లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ సభ్యులు ప్రశాంత్ మెహతా, ఆయన తల్లి చారు మెహతాలు ఆరోపించారు. అంతేకాకుండా మాజీ ట్రస్టీలు రూ.1500 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బాంద్రా పోలీస్ స్టేషన్‌తో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.