Video : రాత్రవ్వగానే వస్తుంది.. కాలింగ్ బెల్ కొడుతుంది.. వెళ్ళిపోతుంది.!

రాత్రవ్వగానే ఓ మహిళ వీధిలోకి వస్తుంది. ఒక ఇంటి తర్వాత మరో ఇంటికి వెళుతూ ఉంటుంది.

By Medi Samrat
Published on : 26 March 2025 2:16 AM

Video : రాత్రవ్వగానే వస్తుంది.. కాలింగ్ బెల్ కొడుతుంది.. వెళ్ళిపోతుంది.!

రాత్రవ్వగానే ఓ మహిళ వీధిలోకి వస్తుంది. ఒక ఇంటి తర్వాత మరో ఇంటికి వెళుతూ ఉంటుంది. డోర్ బెల్ కొట్టేస్తుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రాత్రిపూట ఒక మహిళ డోర్‌బెల్స్ మోగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజా మండి, సోనా గార్డెన్ ప్రాంతాల నుండి వచ్చిన అనేక సిసిటివి ఫుటేజ్‌లలో ఆ మహిళ డోర్‌బెల్స్ మోగించి రాత్రిపూట అదృశ్యమైనట్లు కనిపించింది.

ఆమె సమక్షంలో పశువులు, వీధి కుక్కలు వింతగా స్పందిస్తూ ఉన్నాయి. ఆమెను చూడగానే పారిపోతున్నట్లు ఫుటేజ్‌లో ఉంది. సల్వార్-కమీజ్ ధరించిన ఆ మహిళ ముఖం పొడవాటి దుపట్టాతో కప్పబడి ఉంది. ఆమె తన రెండు పాదాలను కూడా బట్టలతో చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో, ఆమెను ఎవరూ గుర్తించలేకపోతున్నారు. నివాసితులు ఆమె ఎందుకు అలా చేస్తోందో అని భయపడుతూ ఉన్నారు.

ఈ ఘటన గురించి అదనపు పోలీసు సూపరింటెండెంట్ నిరంజన్ శర్మ మాట్లాడారు. అధికారికంగా ఎటువంటి ఫిర్యాదులు నమోదు కాలేదని, స్టేషన్ ఇన్‌చార్జ్‌ని పెట్రోలింగ్ పెంచాలని ఆదేశించామని చెప్పారు. ఆ మహిళ గురించి సమాచారాన్ని సేకరించడానికి పోలీసులు నిఘా ఉంచారని ఆయన అన్నారు. స్పష్టమైన సమాధానాలు లేకపోవడంతో, అనుమానిత మహిళ కోసం పోలీసులు తమ అన్వేషణను కొనసాగిస్తున్నారు.

Next Story